ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Accident: సైన్ బోర్డును ఢీకొట్టిన లారీ.. క్లీనర్ దుర్మరణం - రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి

డ్రైవర్ నిద్రమత్తులో సైన్ బోర్డు హోర్డింగ్​ను లారీ ఢీకొట్టిన కారణంగా జరిగిన ప్రమాదంలో.. క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని ఏర్రకత్వ బస్ స్టాప్ వద్ద జరిగింది. లారీలో ఇరుక్కుపోయిన క్లీనర్ మృతదేహన్ని హైవే సిబ్బంది జేసీబీ సహయంతో బయటకు తీశారు.

సైన్ బోర్డును ఢీకొట్టిన లారీ
సైన్ బోర్డును ఢీకొట్టిన లారీ

By

Published : Aug 4, 2021, 5:37 PM IST

సైన్ బోర్డు హోర్డింగ్​ను లారీ ఢీకొట్టిన ఘటనలో.. క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు సమీపంలో చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి నాగపూర్​కు టామోటా లోడ్​తో వెళ్తున్న లారీ... కర్నూలు సమీపంలోని ఏర్రకత్వ బస్ స్టాప్ వద్ద ఉన్న సైన్ బోర్డు హోర్డింగ్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ అనిల్ రామ్​ అక్కడిక్కడే ప్రాణాలుకోల్పోయాడు.

డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్, క్లీనర్ మహారాష్ట్రకు చెందిన వారుగా ఉలిందకొండ పోలీసులు గుర్తించారు. లారీలో ఇరుక్కుపోయిన క్లీనర్ మృతదేహన్ని నేషనల్ హైవే సిబ్బంది జేసీబీ సహయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దెబ్బతింది. డ్రైవర్ నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details