తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు(patancheru) ఓఆర్ఆర్పై దారుణం జరిగింది. వెనుక వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వలేదని ఓ లారీ డ్రైవర్‌ను కిరాతకంగా కొట్టి చంపారు (lorry driver murder). నిందితులను పోలీసులు రాత్రికి రాత్రే పట్టుకున్నారు.
MURDER: పటాన్చెరు ఓఆర్ఆర్పై దారుణం.. సైడ్ ఇవ్వలేదని కొట్టి చంపారు.. - Lorry driver brutally murdered in patancheru
వాహనానికి సైడ్ ఇవ్వలేదని ఓ లారీ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తులు రాడ్‌తో దాడిచేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన లారీడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు (lorry driver murder). ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు(patancheru) శివారు ఓఆర్ఆర్పై జరిగింది.
![MURDER: పటాన్చెరు ఓఆర్ఆర్పై దారుణం.. సైడ్ ఇవ్వలేదని కొట్టి చంపారు.. lorry driver brutal murder at patancheru orr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12281718-878-12281718-1624803809649.jpg)
ఏపీలోని కృష్ణాజిల్లా తాడేపల్లికి చెందిన అనిల్... సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం నాగులపల్లిలోని స్టీల్ కంపెనీ నుంచి లారీలో స్టీల్లోడుతో బెంగళూరు వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి డీసీఎంలో వచ్చిన ఇద్దరు... లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం లారీని దాటొచ్చి డీసీఎంను అడ్డంగా నిలిపి లారీ డ్రైవర్ అనిల్‌తో గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి ఇనుప రాడ్‌తో అనిల్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాత్రికి రాత్రే నిందితులను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి:Flash: బీచ్‌లో నలుగురి గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం!