ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తిరుమలలో అతిథి గృహం వద్ద మద్యం పట్టివేత - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తాలు

Liquor Seized తిరుమలలో పోలీసులు నిషేదిత వస్తువులపై గట్టి భద్రత చర్యలు చేపట్టినా, అక్రమార్కులు పోలీసుల నుంచి తప్పించుకుని వాటిని రవాణా చేస్తున్నారు.

Liquor Seized in Tirumala
తిరుమలలో అతిథి గృహం వద్ద మద్యం పట్టివేత

By

Published : Aug 22, 2022, 4:35 PM IST

Liquor Seized in Tirumala: తిరుమలలో నిషేధిత వస్తువులపై ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన అక్రమార్కులు అగడం లేదు. ఈ రోజు తిరుమలలో 13 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. మద్యాన్ని సరఫరా చేస్తున్నఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సప్తగిరి అతిథి గృహం వద్ద మద్యం సరఫరా చేస్తున్న శ్రీరాములు అనే వ్యక్తి నుంచి 13 మద్యం సీసాలను తిరుమల ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు శ్రీరాములు అనే వ్యక్తిని, తిరుమల రెండో పట్టణ పోలీసులకు అప్పగించామని అధికారులు తెలిపారు. తిరుమలకు నిషేధిత వస్తువులను రవాణా చేస్తే..ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details