ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Life imprisonment: హైదరాబాద్​లో బాలుడిపై హత్యాచారం.. నిందితుడికి కఠిన శిక్ష! - Life imprisonment

ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి.. హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన హైదరాబాద్ బాలాపూర్​ పీఎస్​ పరిధిలో చోటు చేసుకుంది.

Life imprisonment
బాలుడిపై అత్యాచారం

By

Published : Jul 21, 2021, 7:06 AM IST

కామంతో పశువులా మారిన ఓ వ్యక్తికి... అభం శుభం తెలియని బాలుడు కనిపించాడు. ఎవరు అయితే ఏముంది తన కోరిక తీరడం ముఖ్యమనుకుని... బాలునికి మాయమాటలు చెప్పాడు. కిరాణ దుకాణానికి వెళ్తున్న బాలుడికి చాక్లెట్ ఆశచూపి... అక్కడి నుంచి ఎత్తుకెళ్లాడు. బాలునిపై లైంగిక దాడి చేసి.. హత్యచేశాడు. ఈ ఘటనపై తెలంగాణలో కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది.

వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ బాలాపూర్​ పీఎస్​పరిధిలోని జల్​పల్లి న్యూహుడా కాలనీకి చెందిన ఒమర్​ బిన్​... వ్యసనాలకు అలవాటు పడి ఆకతాయిగా తిరిగేవాడు. కిరాణ దుకాణానికి వెళ్తున్న బాలుడిని అడ్డగించి... చాక్లెట్​ ఆశ చూపాడు. మెల్లిగా అక్కడి నుంచి బాలుడిని తీసుకెళ్లాడు. సమీపంలో ఉన్న నిర్మానుష్యా ప్రాంతానికి తీసుకెళ్లి... లైంగిక దాడి చేశాడు. రక్షించిమని కేకలు వేస్తున్న బాలుడిని నేలకేసి బాదాడు. ఈ ఘటనలో బాలుడు తల పగిలి తీవ్ర రక్తస్రావమై... అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

సొంత చెల్లినీ వదలని కామాంధులు.. చిన్నతనం నుంచే లైంగిక వేధింపులు

ఈ దుర్ఘటన మే 8వ తేదీ 2019 సంత్సరంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలాపూర్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని... నిందితుడిని అరెస్ట్ చేశారు. రిమాండ్​కు తరలించారు. సాక్ష్యాలు, ఆధారాలతో పోలీసులు.. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. విచారణ పూర్తి అయిన తర్వాత రంగారెడ్డి కోర్టు ఒమర్​బిన్​ హసన్​ను నిందితుడిగా తేల్చింది. నిందితుడికి జీవితఖైదు విధించడంతో పాటు... రూ.7వేల జరిమానా విధించింది.

ఇదీ చూడండి:

ఆ ఏడుగురు ఎక్కడ? అది నక్సల్స్​ పనేనా?

ABOUT THE AUTHOR

...view details