గత నెల 17న బిహార్‌లోని దర్భంగా రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై వస్త్రాల పార్శిల్లో జరిగిన బ్లాస్ట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. హైదరాబాద్ నాంపల్లిలో నివాసం ఉంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్ అలియాస్ ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ నజీర్ ఖాన్ అలియాస్ నాసిర్ మాలిక్ పేలుళ్లలో కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పార్శిల్ కౌంటర్ వద్ద నిందితులు సూపియాన్ అనే పేరుతో ఓ పాన్ కార్డు ప్రతిని సమర్పించారు. పేలుడు తర్వాత దర్భంగా జీఆర్పీ సహకారంతో దర్యాప్తు చేసిన ఎన్ఐఏ పార్శిల్ కౌంటర్ వద్ద ఇచ్చిన ఫోన్ నంబర్‌పై దృష్టి సారించారు.
పక్కా సమాచారంతో..
సికింద్రాబాద్ నుంచి దర్భంగాకు తరచుగా వస్తువులు వస్తూనే ఉంటాయి. కాని దుస్తులు రావడం ఇదే మొదటిసారి. పైగా అసలు ఇక్కడ నుంచి దుస్తులు పంపాల్సిన అవసరం ఏముందనే దానిపై దృష్టి సారించారు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం పంపి ఉంటే ఒకటి రెండు పంపుతారు. కాని అన్ని కిలోల దుస్తులు ఎందుకు పంపుతారు అనే అనుమానంతో పార్శిల్ కౌంటర్ వద్ద ఇచ్చిన ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేయగా ఆ నంబరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శామి జిల్లా జైరానాకు చెందిన వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. టవర్ లొకేషన్లో హైదరాబాద్ ఆపరేట్ అవుతున్నట్లు తేల్చారు. పార్శిల్ పంపిన బట్టల దుకాణంలో ఆరా తీశారు. పక్క సమాచారంతో నాంపల్లికి చెందిన ఇమ్రాన్ మాలిక్, మహ్మద్ నజీర్ ఖాన్‌ను అరెస్టు చేశారు. వీరు ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్నట్లు గుర్తించారు.
పాక్ ఉగ్రవాదుల మార్గదర్శనం