ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

విధుల్లో ఉన్న కానిస్టేబుల్​ను ఢీకొట్టిన లారీ.. దారుణ మరణం - గుంటూరు తాజా రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లా ఫిరంగిపురం చెక్​పోస్టు వద్ద ఓ ట్రాక్టర్​ను సోదా చేస్తున్న స్పెషల్ పోలీసు ఆఫీసర్​ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీసు అధికారి అక్కడికక్కడే మృతిచెందారు.

larry-collides-with-a-special-police-officer-constable-on-duty-at-guntur
విధుల్లో ఉన్న కానిస్టేబుల్​ను ఢీకొట్టిన లారీ.. నుజ్జునుజ్జయిన తల​

By

Published : Nov 8, 2021, 12:05 PM IST


గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఓ లారీ.. స్పెషల్ పోలీసు ఆఫీసర్ ప్రాణాలు తీసింది. లారీ చక్రం తలమీదకు ఎక్కడంతో షేక్ మహ్మద్ నాజర్ అక్కడికక్కడే చనిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి చెందిన నాజర్.. గుంటూరు రూరల్ వెంగలాయపాలెంలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.

ఫిరంగిపురం చెక్ పోస్టు దగ్గర గుంటూరు వెళ్తున్న ట్రాక్టర్​ను సోదా చేస్తుండగా ట్రాక్టర్​ను లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో మహ్మద్ నాజర్ కింద పడిపోరు. దూసుకొచ్చిన లారీ.. ఆయనపై నుంచి వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్, క్లీనర్ ను.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికిి తరలించారు.

ఇదీ చూడండి:4 CRPF Jawans Killed: సెలవులపై గొడవ.. సహచరులపై జవాన్ కాల్పులు.. నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details