suicide attempt: కడపలో డిప్యూటీ జైలర్ ఆత్మహత్యాయత్నం - కడప జిల్లా తాజా సమాచారం
08:50 October 20
చేతి మణికట్టు కోసుకున్నట్లు గుర్తించిన పోలీసులు
కడప ప్రత్యేక మహిళా కారాగారంలో డిప్యూటీ జైలర్గా పనిచేస్తున్న చిన్న ఇమామ్బీ.. ఆత్మహత్యకు యత్నించారు. చేతి మణికట్టు వద్ద కత్తితో కోసుకున్నట్లు (deputy jailer suicide attempt) అధికారులు తెలిపారు. తన ఇంట్లోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. గమనించిన సిబ్బంది.. వెంటనే ఆమెను కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
చిన్న ఇమామ్బీ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న జైలు అధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారుల వేధింపులా? వ్యక్తిగత కారణాలా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామన్నారు.
ఇదీ చదవండి