ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

నకలీ భూపత్రాలు చూపింది.. దర్జాగా సొమ్ము దోచేసింది..! - land mafia at gannavaram

నకలీ భూపత్రాలతో అమాయకులను మోసం చేస్తున్న కిలాడీ లేడీ గన్నవరం పోలీసులకు చిక్కింది. గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన వ్యక్తికి నకిలీ భూమి పత్రాలు చూపి.. రూ.3 లక్షలు దోచిన మహిళను పోలీసులు అరెస్ట్​ చేశారు. న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

lady cheated a man at gannavaram
lady cheated a man at gannavaram

By

Published : Jun 16, 2021, 8:03 AM IST

నకిలీ భూపత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న రమాదేవి అనే మహిళను.. కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. విజయవాడకు చెందిన కొప్పుల రమాదేవికి.. గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన వ్యక్తితో మధ్యవర్తుల ద్వారా పరిచయం ఏర్పడింది. దీన్ని అదునుగా చేసుకున్న రమాదేవి గన్నవరం మండలం మెట్లపల్లిలో 50 సెంట్ల మేర భూమి విక్రయానికి ఉందని సదరు వ్యక్తికి చెప్పింది.

దస్త్రాలు తీసుకువస్తేనే కొనుగోలు చేస్తానని ఆ వ్యక్తి చెప్పడంతో నకిలీ పత్రాలు చూపించి.. అడ్వాన్స్‌గా 3 లక్షల రూపాయల తీసుకుంది. రోజులు గడుస్తున్నా భూమి చూపించకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆవ్యక్తి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రమాదేవిపై ఇప్పటికే పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులతో పాటు రౌడీషీట్ కూడా తెరిచినట్లు గుర్తించారు. ఆ మేరకు నిందితురాలిని అదుపులోకి తీసుకుని గన్నవరం కోర్టులో హాజరు పర్చారు. న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

ABOUT THE AUTHOR

...view details