తెలంగాణలోని సంచలనం సృష్టించిన సైదాబాద్ ఆత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్ వద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాష్ట్రవ్యాప్తంగా అతని కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్డడం సహా సామాజిక మాధ్యమాల్లో పోటోలు..... విస్తృతంగా ప్రచారం జరగడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయినట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌పై మృతదేహం గుర్తించినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పినట్లు పేర్కొన్నారు.