ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ప్రొ.కోదండరాం ఓటమిని తట్టుకోలేక అభిమాని ఆత్మహత్యాయత్నం - mahabubabad district latest news

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొ.కోదండరాం ఓటమిని జీర్ణించుకోలేని ఓ అభిమాని ఆత్మహత్యాయత్నం చేశాడు. తమ నాయకుడిని గెలిపించుకోలేకపోయామనే మనస్తాపంతో పెట్రోల్​ పోసుకుని చావబోయాడు. స్థానికులు గమనించి అడ్డుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

SUICIDE ATTEMPT
SUICIDE ATTEMPT

By

Published : Mar 21, 2021, 10:46 PM IST

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ఓటమితో మనస్తాపానికి గురైన ఓ అభిమాని ఆత్మహత్యాయత్నం చేశాడు. మహబూబాబాద్​ మండలం సాధు తండాకు చెందిన రాజు అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన స్థానికులు రాజును అడ్డుకున్నారు.

విషయం తెలుసుకున్న తెజస జిల్లా అధ్యక్షుడు డోలి సత్యనారాయణ, తదితరులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రాజుకు ధైర్యం చెప్పి కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ కౌన్సిలింగ్ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details