డబ్బుల కోసం తండ్రిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న చిత్తూరు జిల్లా పీలేరు మండలం గొల్లవానికుంటలో తిమ్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. డబ్బుల కోసం కుమారుడు చంద్రయ్య తండ్రిని తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికి అనుమానం రాకుండా దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటకు రావడంతో తానే తండ్రిని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
డబ్బుల కోసం తండ్రిని హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించి - peeleru police latest news
తండ్రిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం తండ్రిని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసుల తెలిపారు.
![డబ్బుల కోసం తండ్రిని హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించి Killing father for money](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11048480-652-11048480-1615988412012.jpg)
డబ్బుల కోసం తండ్రిని హతమార్చి