ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కత్తులతో బెదిరించి యువకుడి కిడ్నాప్... రంగంలోకి పోలీసులు - telangana latest news today

గురువారం అర్ధరాత్రి ఓ యువకుడు కిడ్నాప్ అయిన ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెహబూబాపురాలో కలకలం రేపింది. కత్తులతో వచ్చిన దుండగులు... యువకుడ్ని బెదిరించి కారులో ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడి జాడ కోసం గాలింపు ప్రక్రియ చేపట్టారు.

కత్తులతో బెదిరించి యువకుడి కిడ్నాప్... రంగంలోకి పోలీసులు
కత్తులతో బెదిరించి యువకుడి కిడ్నాప్... రంగంలోకి పోలీసులు

By

Published : Feb 12, 2021, 3:03 AM IST

తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెహబూబాపురాలో ఆమెర్ అనే యువకుడ్ని గురువారం అర్ధరాత్రి కారులో వచ్చిన దుండగులు అపహరించుకుపోయారు. మొదట కారులో యువకుడి ఇంటికి చేరుకున్న నలుగురు వ్యక్తులు సహా ఓ మహిళ... కత్తులతో బెదిరించి బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు.

డయల్​ 100కు...

బాధిత కుటుంబ సభ్యులు డయల్ 100కు ఫోన్​ చేయడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కిడ్నాప్​ను ఛేదించేందుకు అనుమానిత ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

వారిద్దరూ కనిపించకపోవడం వల్లే...

కోరుట్లకు చెందిన ఓ యువతి, జగిత్యాలకు చెందిన ఇర్ఫాన్ ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ కనిపించకపోవడం వల్ల యువతికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఇర్ఫాన్ సోదరుడు ఆమెర్​ను కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కత్తులతో బెదిరించి యువకుడి కిడ్నాప్... రంగంలోకి పోలీసులు

ఇదీ చూడండి : రాకాసి అలలతో మెరీనా బీచ్‌లో విద్యార్థి మృతి... మరో ఇద్దరి గల్లంతు

ABOUT THE AUTHOR

...view details