CRYPTO CURRNECY TRADING FRUAD : ఫోర్జరీ, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మోసం కేసులో యూపీకి చెందిన కీలక నిందితుడిని రాష్ట్ర సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో దాడులు నిర్వహించిన పోలీసులు నిందితుడు అభిషేక్ జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నిందితుడిపై మూడు కమిషనరేట్ పరిధుల్లో పలు కేసులు నమోదయ్యాయి. నిందితుడి వద్ద నుంచి రూ.9 కోట్లకు పైగా నగదు, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మోసం కేసులో కీలక నిందితుడి అరెస్టు, 9 కోట్లు స్వాధీనం - CRYPTO CURRNECY TRADING FRUAD CASE
CRYPTO CURRNECY TRADING FRUAD CASE ఫోర్జరీ, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మోసం కేసులో యూపీకి చెందిన కీలక నిందితుడిని తెలంగాణ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
![క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మోసం కేసులో కీలక నిందితుడి అరెస్టు, 9 కోట్లు స్వాధీనం CRYPTO CURRNECY TRADING FRUAD CASE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16185816-804-16185816-1661336966119.jpg)
చందౌలీ జిల్లాలోని రవినగర్‌లో ఉన్న ఓ బడా వ్యాపారవేత్త కుమారుడు అభిషేక్ జైన్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. నిందితుడి ఇంట్లో ఉన్న రూ.9 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభిషేక్ జైన్ యాప్ ద్వారా ప్రజల సొమ్మును రెట్టింపు చేస్తానని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు తన యాప్ ద్వారా రాష్ట్రానికి చెందిన చాలా మందిని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే నిందితుడిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: