ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

మహేశ్‌ బ్యాంక్‌ కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించిన పోలీసులు - ts news

Mahesh Bank Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన మహేశ్‌ బ్యాంక్‌ సర్వర్‌పై సైబర్‌ దాడి కేసులో పోలీసులు కీలక నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 20 మందిని అరెస్టు చేశారు.

Key accused in cyber attack on Mahesh Bank server arrested
మహేశ్‌ బ్యాంక్‌ కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించిన పోలీసులు

By

Published : Mar 30, 2022, 12:35 PM IST

Mahesh Bank Case: మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో కీలక నిందితుడిని.. తెలంగాణలోని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సర్వర్​ను హ్యాక్ చేసి 12 కోట్ల ఇతర ఖాతాలకు మళ్లించిన ఘటనలో ప్రధాన సూత్రధారిని పోలీసులు గుర్తించగలిగారు. జనవరి 23వ తేదీన మహేష్ బ్యాంక్ సర్వర్​ను హ్యాక్ చేసిన నిందితుడు పన్నెండు కోట్ల రూపాయలను.. నాలుగు ఖాతాల్లోకి మళ్లించాడు. ఆ తర్వాత అప్పటికే సిద్ధం చేసుకున్న మరో 128 ఖాతాలకు 12 కోట్లు మళ్లించాడు. సర్వర్​లో నుంచి నగదు అక్రమంగా బదిలీ అయిన విషయం గమనించిన మహేష్ బ్యాంకు ప్రతినిధులు.. అప్రమత్తమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు బదిలీ అయిన విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సదరు బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లడంతో మూడు కోట్ల రూపాయలను బదిలీ కాకుండా నిలిపి వేయగలిగారు. 9 కోట్ల రూపాయలు మాత్రం సైబర్ నేరగాళ్లు పలు ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకున్నారు.

పోలీసులు ఇప్పటికే ఈ కేసులో 20 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడికి సైబర్ నేరగాళ్లు ఖాతాలు సమకూర్చారు. దిల్లీ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్, బెంగళూరు, ముంబయిలోని బ్యాంకులకు సంబంధించిన ఖాతాలుగా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడి ఆచూకీ కనుక్కునేందుకు సైబర్ పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. ఎక్కడి నుంచి సర్వర్ హ్యాక్​ చేసేందుకు ప్రయత్నించారనే విషయం తెలుసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతికతను ఉపయోగించుకున్నారు. కానీ నిందితుడు ప్రాక్సీలో నకిలీ ఐడీలతో దక్షిణాఫ్రికా నుంచి చేసినట్టుగా పోలీసుల దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు. చివరికి రెండు నెలల పాటు దర్యాప్తు నిర్వహించిన పోలీసులు ప్రధాన నిందితుడిని గుర్తించారు.

గతంలో అపెక్స్ బ్యాంకుతో పాటు బహ్రెయిన్ బ్యాంకు సర్వర్​ను హ్యాక్ చేసి దాదాపు నాలుగు కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. ఆ బ్యాంకులతో నిందితులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మధ్యాహ్నం పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

ఇదీ చదవండి:
మహేశ్​ బ్యాంక్​ సర్వర్​ హ్యాకింగ్​ కేసులో మరింత పురోగతి... నలుగురు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details