Police Raid: అనంతపురం జిల్లా లేపాక్షి మండల సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూరు తాలూకా నగిరిగేరా గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై గౌరిబిదనూరు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. హిందూపురం ప్రాంతానికి చెందిన 19 మంది జూదరులు అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి 1,50,000 రూపాయల నగదు, మూడు కార్లు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు.
అరెస్ట్ అయిన వారిలో హిందూపురం నియోజకవర్గంలోని అధికార పార్టీ వైకాపాకు చెందిన ఓ నాయకుడు మరియు కార్యకర్తలతో పాటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. గౌరిబిదనూరు పోలీసులకు దొరికిన జూదరులను గుడిబండ కోర్టులో హాజరుపరిచారు.