అనంతపురం జిల్లా మడకశిర మండలం దిన్నమీదపల్లి గ్రామ సమీపంలో పోలీసులు కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన అంబులెన్స్ వాహనంలో చాకచక్యంగా మద్యం రవాణా చేస్తున్న దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక మద్యం రవాణా చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్‌ను వెంటాడి మద్యం స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5 లక్షల విలువగల మద్యాన్ని పట్టుకున్నారు. మొత్తం 64 బాక్సుల్లో.. 3,525 టెట్రా ప్యాకెట్లలో మద్యం పట్టుబడింది.
అంబులెన్స్‌ను ఛేజ్ చేసిన పోలీసులు...ఎందుకంటే..! - అనంతపురం క్రైమ్ వార్తలు
అక్రమ మద్యం రవాణాకు దుండగులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. అత్యవసర పరిస్థితులలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు.. ఉపయోగించే అంబులెన్స్‌ను ఏకంగా అక్రమ మద్యం రవాణాకు ఉపయోగించారు. కర్ణాటక నుంచి అంబులెన్స్‌లో యథేచ్చగా మద్యాన్ని రవాణా చేస్తున్నారు.
అంబులెన్స్‌లో అక్రమ మద్యం
ప్రధాన నిందితుడు బెంగుళూరులోని వైన్ షాప్ మేనేజర్ జయరామిరెడ్డిగా గుర్తించారు. అనంతపురం జిల్లా కదిరి, బుక్కపట్నం ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను, కర్ణాటకకు చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రమ్య తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. స్థానిక సీఐ, ఎస్సై, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఇదీ చదవండి: