ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

వాహనాల కొనుగోలు స్కామ్‌.. రెండోరోజు ఈడీ ముందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి - జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy on ED Enquiry: వాహనాల కొనుగోలు విషయంలో ఈడీ అధికారుల ఎదుట రెండో రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. నిన్న 8 గంటల పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది.

JC Prabhakar Reddy
జేసీ ప్రభాకర్ రెడ్డి

By

Published : Oct 8, 2022, 12:13 PM IST

JC Prabhakar Reddy on ED Enquiry: హైదరాబాద్​లోని ఈడీ కార్యాలయానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లారు. రెండోరోజు విచారణకు తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. నిన్న 8 గంటల పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. వాహనాల కొనుగోలు స్కామ్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే నిన్న ఈడీ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించారు.

అసలేెం జరిగిదంటే:గతంలో ఏపీ రవాణా శాఖ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. తమిళనాడు, ఉత్తరాఖండ్​లోని అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి వాహనాలను రెండు కంపెనీలకు తుక్కు కింద కొనుగోలు చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని నాగాలాండ్​లో బీఎస్-4 వాహనాల కింద రిజిస్ట్రేషన్ చేయించి.. ఏపీకీ బదిలీ చేయించారని రవాణా శాఖ అధికారులు అందులో తెలిపారు.

ఇందుకోసం నకిలీ ధ్రువపత్రాలను సృష్టించినట్లు రవాణా శాఖ అధికారుల దర్యాప్తులో తేలింది. రెండేళ్ల క్రితం రవాణా శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు జేసీ సోదరులపై కేసు నమోదు చేశారు. పోలీసు కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే జూన్ 17న అనంతపురం తాడిపత్రిలోని జేసీ సోదరుల నివాసాలతో పాటు హైదరాబాద్​లోనూ సోదాలు నిర్వహించారు. జేసీ సోదరుల చరవాణిలతో పాటు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details