ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ప్రియుడ్ని భర్తగా మార్చిన కి'లేడీ'... రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకోవాలని సవాల్ - Illegal Affairs News

Jawan Wife Illegal Affair: వివాహేతర సంబంధాలు మనుషుల్ని ఏ పనైనా చేసేలా పురిగొల్పుతున్నాయి. పరాయి మోజులో పడి బంధాల్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఆర్మీ జవాన్ భార్య.. ప్రియుడినే భర్తగా చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని రాసలీలలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భర్తకు అడ్డంగా దొరికిపోయింది సదరు కి'లేడీ'.

1
1

By

Published : May 19, 2022, 3:55 PM IST

Jawan Wife Illegal Affair: ఆమె ఓ ఆర్మీ జవాన్ భార్య. భర్త విధులకు వెళ్తే... భార్య మాత్రం పరాయి వ్యక్తికి శృంగార విధులు నిర్వహిస్తోంది. ప్రియుడి మోజులో పడి.. ఏకంగా అతడినే భర్తగా చెప్పి ఇంటిని అద్దెకు తీసుకుంది. హైదరాబాద్​ రహమత్​నగర్​లో నివాసం ఉంటున్న కి'లేడీ' ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తోంది. అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్ ఏకాంతంగా ఉన్న భార్య, ప్రియుడు జ్ఞానేశ్వర్​ను చూసి షాక్​ అయ్యారు. వారిద్దరిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం వాళ్లను ఇంట్లోనే ఉంచి తాళం వేసిన జవాన్... భార్య, ఆమె ప్రియుడిపై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటికి వచ్చి భర్తతో తాళం తీయించారు. బయటకు రావాలని జవాన్​ భార్యకు, ఆమె ప్రియుడికి పోలీసులు సూచించినా చాలాసేపటి వరకు బయటకు రాలేదు. అనంతరం బయటకు వచ్చారు. జవాన్‌ దంపతులకు ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. జవాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కలిగాక మరో పురషుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఏంటని ఆర్మీ జవాన్ తీవ్రంగా మదనపడుతున్నారు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. నమ్మించి మోసం చేసిందని బాధపడుతున్నారు. ఈ విషయం గురించి ఇదివరకే తెలిసి ఒకసారి సూసైడ్ ప్రయత్నం చేసినట్లు భర్త వాపోయారు. ఈ వివాహేత బంధం గురించి నిలదీస్తే... దమ్ముంటే రెడ్​హ్యాండెడ్​గా పట్టుకోవాలని సవాల్ విసిరినట్లు వాపోయారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details