తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలి. అదీ సులభంగా డబ్బు ఖాతాలోకి రావాలి. ఇలా ఆశపడేవారే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి. అధిక మొత్తంలో లాభాలంటూ.. ఆకర్షణీయ ప్రకటనలతో లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. గృహిణులు, విద్యావంతులు లక్ష్యంగా మోసాలు చేస్తున్నారు. అమెజాన్‌లో పార్ట్‌టైం ఉద్యోగం.. రోజుకు 10వేలకు సంపాదన అంటూ వచ్చిన సందేశానికి స్పందించిన చందానగర్‌కు చెందిన ఓ యువకుడు 2లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. తక్కువ పెట్టుబడికి అధిక లాభాలంటూ.. హెచ్పీజడ్యాప్లో పెట్టుబడులు పెట్టిన సుచిత్రవాసి.. 6లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. షాపింగ్ చేస్తే కమీషన్లు వస్తాయంటూ వచ్చిన ప్రకటనతో.. రాజేంద్రనగర్‌కు చెందిన మహిళ రెండున్నర లక్షలు బూడిదపాలు చేసుకుంది.
చివరికి పోలీసుల వద్దకు