ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తస్మాత్ జాగ్రత్త: ఉదయం రెక్కీ.. రాత్రికి చోరీ - medchal district crime news

సంచార జాతుల మాదిరిగా గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. ఉదయం పూట రుద్రాక్షలు, ఆయుర్వేద మందులు అమ్మేవారిలాగా రెక్కీ నిర్వహిస్తారు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి.. రాత్రికి గుళ్ల చేస్తారు. తెలంగాణలో ఈ తరహా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

rabbory
rabbory

By

Published : Mar 9, 2021, 10:11 AM IST

అంతర్రాష్ట్ర దొంగలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడే 11 మంది అంతర్రాష్ట్ర పార్థి ముఠా సభ్యులను ప్రత్యేక పోలీసు బృందం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు హైదరాబాద్ పరిధిలోని పేట్ బషీరాబాద్ ఏసీపీ రమణరాజు తెలిపారు. తెలంగాణ మేడ్చల్ పోలీసు స్టేషన్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ఈ ముఠా మధ్యప్రదేశ్​కు చెందింది. వీరు మొత్తం 60 మంది. సంచార జాతుల మాదిరిగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని, ఉదయం రుద్రాక్షలు, ఆయుర్వేద మందులు అమ్మేవారి లాగా రెక్కీ నిర్వహిస్తారు. రెండు, మూడు రోజులుగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి నగదు, బంగారం ఎత్తుకెళ్తారు. చోరీలు చేయగానే సొంత గ్రామాలకు వెళ్లి వస్తువులను అమ్ముకుని వస్తారు. - ఏసీపీ రమణరాజు

ఈ ముఠా సంచార జాతుల మాదిరిగా గుడారాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చోరీలకు పాల్పడినట్లు ఏసీపీ పేర్కొన్నారు. మేడ్చల్, శామీర్​పేట్​, బాలానగర్, అల్వాల్, పేట్​ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 20 కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రధాన నిందితులు బల్వా, కొలం, ఠాకూర్, పెక్లోడ్​లు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి రూ.1.40 లక్షల నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 3.8 తులాల బంగారం, 26 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో మచ్చబొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు.

ఇదీ చూడండి:

కూర్మన్నపాలెంలో కొనసాగుతున్న కార్మిక సంఘాల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details