Arrest: తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్‌లతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న సుంకర ప్రసాద్ నాయుడు ముఠాను అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్న ప్రసాద్ నాయుడితోపాటు 13 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక పిస్తోలు, 16 తూటాలు, 3 వాహనాలతోపాటు రూ.6.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
గుంతకల్లు మండలం జి.కొట్టాలకు చెందిన కోనంకి వెంకటేష్‌ను డబ్బు కోసం ఈ నెల 20న ఈ ముఠా కిడ్నాప్ చేసింది. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఓబుళాపురం పైమిట్టపై దాచిపెట్టి, రూ.కోటి ఇవ్వకపోతే చంపేస్తామని కుటుంబ సభ్యులను బెదిరించారు. వారు పోలీసులకు ఆశ్రయించడంతో.. కిడ్నాపర్ల కోసం ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఆదివారం పక్కా సమాచారంతో పోలీసులు డోన్ సమీపంలోని ఓబుళాపురం పైమిట్టపై కిడ్నాపర్ల ముఠాను పట్టుకున్నట్లు.. కేసు వివరాలను ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు.