ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

వీడు మామూలోడు కాదు.. సీసీ కెమెరాకు చిక్కకుండానే..

Interesting Bike Theft: ఓ దొంగ చేసిన బైక్​ చోరీ అందరు అవాక్కయ్యేలా చేస్తోంది. చేయాలనుకున్న దొంగతనాన్ని.. సులువుగా.. ఎలాంటి ఆధారం లేకుండా జాగ్రత్తపడిన విధానం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. సీసీ కెమెరాకు కూడా దొరకకుండా.. ఆ చోరుడు వాడిన దొంగ తెలివితేటలు చూసి.. నోరెళ్లబెట్టాల్సిందే.. ఏంటీ.. నమ్మకం కుదరట్లేదా..? అయితే మీరూ ఈ చోరీ చూసేయండి..

Interesting Bike Theft
Interesting Bike Theft

By

Published : Jul 29, 2022, 5:23 PM IST

వీడు మామూలు దొంగ కాదండోయ్​.. సీసీకెమెరాకు చిక్కక్కుండా బైక్​ లేపేశాడు..!

Interesting Bike Theft: "ఒక్క సీసీ కెమెరా పది మంది పోలీసులతో సమానం. సీసీ కెమెరా పెట్టుకుంటే రోజంతా పహారా కాస్తూనే ఉంటుంది. చోరీ జరిగితే.. దొంగను ఇట్టే పట్టేస్తుంది. దొంగతనాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలే ప్రధాన అస్త్రం." అంటూ.. ప్రజలకు పోలీసులు పెద్దఎత్తున అవగాహన కల్పించారు. ఫలితంగా.. కొంతమంది కలిసి తమ కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు ప్రత్యేకంగా ఇళ్లలో కూడా పెట్టుకున్నారు. అయితే.. సీసీ కెమెరాల వల్ల చాలావరకు ఉపయోగం ఉన్న మాట నిజమే అయినప్పటికీ.. దొంగలు కూడా వాటికి తగ్గట్టుగా అప్​డేట్​ అయ్యారు. నిఘా నేత్రాలకు చిక్కకుండా జాగ్రత్తపడుతూ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పాత కోర్టు బజార్ ప్రాంతంలో జరిగిన ఓ చోరీ.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ దొంగతనం చేసిన చోరుడి విజ్ఞాన ప్రదర్శన అవాక్కయ్యేలా చేస్తోంది. కోర్టు బజార్​లో ఓ ఉద్యోగి తన ఇంటిముందు ద్విచక్రవాహనాన్ని నిలిపాడు. రోజూ అక్కడే పార్క్​ చేస్తున్న బండిపై ఓ దొంగ కన్నేశాడు. ఎవరూలేని సమయంలో.. బండిని దొంగలించాలని పథకం కూడా వేశాడు. అయితే.. ఆ ఉద్యోగి ఇంటి ముందు సీసీ కెమెరా ఉన్న విషయాన్ని ఆ దొంగ గుర్తించాడు. ఎలాగైనా బండి కొట్టేయాలనుకున్న చోరుడు.. తన దొంగ తెలివితేటలను ప్రదర్శించాడు. సీసీ కెమెరా ఫోకస్​ను ముందు నుంచే గమనిస్తూ వచ్చిన దొంగ.. చోరీకి వచ్చినప్పుడు తాను ఆ నిఘానేత్రానికి చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. చేతికి అందేలా ఉన్న ఆ సీసీ కెమెరా ఫోకస్​ను​ ద్విచక్ర వాహనం మీద లేకుండా పక్కకు తిప్పేశాడు. ఇంకేముంది.. వాహనాన్ని సులువుగా ఎలాంటి రిస్క్​ లేకుండా.. ఎలాంటి ఆధారాలు దొరకకుండా.. దర్జాగా దొంగిలించుకుపోయాడు.

పొద్దున లేచి చూసిన ఉద్యోగి.. తన వాహనం చోరీ అయినట్టు గుర్తించాడు. బైకును ఎవరు దొంగిలించారో చూద్దామని సీసీ కెమెరాను దృశ్యాలను చూసి అవాక్కైయ్యాడు. తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో సీసీ కెమెరా ఫోకస్ తప్పించి వాహనాన్ని దొంగిలించినట్లు అర్థమైంది. ఈ ఊహించని పరిణామంతో.. వాహనాలను అజాగ్రత్తగా పెట్టకూడదు అనేదే కాకుండా సీసీ కెమెరాలు కూడా చేతికి అందకుండా పెట్టాలనే సందేశం బోధ పడినట్టైంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details