Died: తిరుపతి జిల్లా గూడూరులో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ పరీక్షలు రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థి.. పరీక్ష కేంద్రం వద్ద గుండెపోటుతో మృతి చెందాడు. గూడూరులోని డీఆర్‌డబ్ల్యూ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సైదాపురానికి చెందిన 18 ఏళ్ల సతీష్.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేందుకు.. డీఆర్‌డబ్ల్యూ పరీక్ష కేంద్రానికి వచ్చాడు. అక్కడ గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే సతీష్ మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Died: ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద గుండెపోటుతో విద్యార్థి మృతి - తిరుపతి జిల్లా తాజా వార్తలు
Died: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థి గుండెనొప్పితో పరీక్ష కేంద్రం వద్ద కుప్పకూలాడు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది.
ఇంటర్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థి గుండెపోటుతో మృతి