తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్నఅంతరాష్ట్ర దొంగల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 లక్షల విలువైన 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు.. రాజేశ్, సాయిగుప్త, మహేంద్రలు.. నంబర్ లేని బైక్‌పై పెరవలి వై జంక్షన్ వద్ద తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వాళ్ల నుంచి ఒక లాప్ ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో పలు కేసులు కూడా నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు.
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. రూ.15 లక్షల విలువైన బైకులు స్వాధీనం - inter state bike thieves in andhra pradesh
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి 15 లక్షల విలువైన 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలోనూ కేసులు నమోదయ్యాయని కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు.
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు