బైక్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ మహిళా కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడింది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పీఎస్‌లో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన వాహనదారులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
fire accident: బైక్‌లో మంటలు.. మహిళా కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
ద్విచక్రవాహనంలో మంటలు చెలరేగి ఓ మహిళా కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తెలంగాణలోని మల్కాజిగిరిలోని మౌలాలి ఫ్లై ఓవర్ వంతెనపై జరిగింది. వెంటనే స్పందించిన వాహనదారులు ఆమెను సమీపంలో ఆస్పత్రికి తరలించారు.
fire accident:
కానిస్టేబుల్ ఇంటికి వెళ్లే దారిలో మల్కాజిగిరిలోని మౌలాలి ఫ్లై ఓవర్ బ్రిడ్జ్‌పైకి రాగానే ద్విచక్రవాహనంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కానిస్టేబుల్ తప్పించుకునే క్రమంలో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
ఇదీ చూడండి:accident: వాళ్ల సరదాగా కొండపల్లి ఖిల్లా ప్రయాణం.. విషాదంగా ముగిసింది