ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

అంబర్​పేట నారాయణ కళాశాల​ ఘటనలో ఒకరు మృతి

Amberpet Narayana College Update: ఇటీవల హైదరాబాద్​లోని నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనలో ఇవాళ ఒకరు మృతి చెందారు. అపోలో డీఆర్​డీవోలో ఏవో అశోక్​రెడ్డి చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరు విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

narayana college
fire

By

Published : Sep 4, 2022, 8:02 PM IST

Amberpet Narayana College Update: హైదరాబాద్​లోని అంబర్​పేట నారాయణ కళాశాలలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనలో ఇవాళ ఓ వ్యక్తి మృతి చెందాడు. కంచన్​బాగ్​లోని అపోలో ఆస్పత్రిలో కళాశాల ఏవో అశోక్​రెడ్డి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థి నేత సందీప్ పరిస్థితి విషమంగా ఉందని.. మరో విద్యార్థి వెంకటాచారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్​రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అసలేం జరిగిందంటే..హైదరాబాద్​ అంబర్​పేటలోని ప్రైవేటు కళాశాలలో విద్యార్థి నాయకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సాయి నారాయణ అనే విద్యార్థి సదరు కళాశాలలో జూన్​లో ఇంటర్ పూర్తి చేశాడు. కళాశాలకు రూ.16 వేల ఫీజు కట్టాల్సి ఉండగా.. మొత్తం చెల్లిస్తేనే టీసీ ఇస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో సాయి నారాయణ కళాశాలకు వెళ్లాడు. ఫీజు చెల్లించలేదని, టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. అతనితో పాటు విద్యార్థి నాయకుడు సందీప్, మరికొందరిని తీసుకెళ్లాడు. ఫీజు బకాయిలు ఉండటంతో టీసీ ఇవ్వడానికి కళాశాల సిబ్బంది నిరాకరించారు.

ఇదే విషయంపై సందీప్, ప్రిన్సిపల్​కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఫీజు విషయం, టీసీ గురించి మాట్లాడుతుండగా సందీప్ ప్రిన్సిపల్​ను బెదిరించేందుకు తనతో తీసుకొచ్చిన పెట్రోల్​ను ఒంటిపై పోసుకున్నాడు. కృష్ణాష్టమి వేళ వెలిగించిన దీపం పక్కనే ఉండటంతో మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్ సుధాకర్​రెడ్డి, ఏవో అశోక్​రెడ్డి గాయపడ్డారు. ఈ ఘటనతో ప్రిన్సిపల్​ గదిలో మంటలు అంటుకుని ఏసీతో పాటు అక్కడి సామగ్రి కాలిపోయాయి. కుర్చీలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details