ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో.. మహిళా వాలంటీర్ ఆత్మహత్య - గుంటూరులో మహిళ ఆత్మహత్య

Woman suicide: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో ఓ మహిళ భవంతి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన భర్త జీవితాంతం తోడుంటానని ప్రేమించి పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మరో మహిళతో చనువుగా ఉండటాన్ని చూసి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది. అయితే భర్తలో మార్పు రాకపోవడంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

suicide
ఆత్మహత్య

By

Published : Dec 21, 2022, 10:24 PM IST

Woman suicide: గుంటూరు జిల్లాలో చింతలపూడి గ్రామానికి చెందిన భాగ్య రేఖ 13 సంవత్సరాల క్రితం జాలాది జగన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఇరువురు సంతానం కలిగింది. భాగ్యరేఖ వాలంటీర్ గా పనిచేస్తుండగా అతని భర్త చేబ్రోలు మండలం నారాకోడూరు సచివాలయంలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. గత కొంతకాలంగా అదే సచివాలయంలో పనిచేస్తున్న మరో మహిళతో సన్నిహితంగా ఉంటూ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. తన పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు ప్రాధేయపడిన అతనిలో మార్పు రాలేదు. దీంతో మనస్థాపానికి చెందిన ఆమె నివాసం ఉంటున్న భవంతి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భార్గవ్ వివరాలను వెల్లడించారు.

భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details