ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తరగతి గదిలో 50 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఏం జరిగిందంటే

STUDENTS FELL ILL : తరగతి గదుల్లో ఊపిరాడక.. కాకినాడ రూరల్ పరిధిలోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం పాఠశాల ప్రారంభమైన కొద్దిసేపటికే.. దాదాపు 50మంది విద్యార్థులు సొమ్మసిల్లిపడిపోయారు. ప్రస్తుతం వారంతా కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ILLNESS FOR STUDENTS
ILLNESS FOR STUDENTS

By

Published : Sep 6, 2022, 2:18 PM IST

Updated : Sep 6, 2022, 3:55 PM IST

KAKINADA STUDENTS FELL ILL : కాకినాడ గ్రామీణం పరిధిలోని.. వలసపాకలలోని కేంద్రీయ విద్యాలయంలో ఒకటి నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఉదయం.. అసెంబ్లీ ముగిసిన తర్వాత విద్యార్థులు తరగతి గదులకు వెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే.. 5, 6, ఏడో తరగతిలో హాహాకారాలు వినిపించాయి. విద్యార్థులు ఒక్కొక్కరుగా సొమ్మసిల్లిపడిపోయారు. దాదాపు 50మంది వరకూ విద్యార్థులు పడిపోయారు.F

వెంటనే పాఠశాల సిబ్బంది.. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలు సొమ్మసిల్లిపడిపోవడం చూసి ఆందోళన చెందారు. ఆ తర్వాత వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను.. కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అస్వస్థతకు కారణం ఏంటో తెలియదని.. పాఠశాల యాజమాన్యం కూడా సరైన సమాచారం ఇవ్వడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. ఘాటైన విషవాయువు పీల్చడం వల్లే విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారని జీజీహెచ్ సూపరింటెండెంట్ బుద్ధ చెప్పారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని పరిస్థితి అదుపులోనే ఉందని సూపరింటెండెంట్ తెలిపారు.

కేంద్రీయ విద్యాలయంలో నిన్న ఓ విద్యార్థికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారని.. ఆ వేడుకల్లో రసాయన స్ప్రేలు వినియోగించినట్టు సమాచారం. అయితే ఏ రసాయనాలు పీల్చడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న విషయం అధికారులు వెల్లడించాల్సి ఉంది.

వలసపాకలలో ఘూటు వాసన పీల్చి విద్యార్థులకు అస్వస్థత

ఇవీ చదవండి:

Last Updated : Sep 6, 2022, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details