Illegal liquor gang attacking police: అక్రమంగా సారా తరలిస్తున్న ముఠా.. పోలీసులపై దాడి చేసిన ఘటనా తూర్పుగోదావరి జిల్లా జిల్లెలపేటలో చోటుచేసుకుంది. ఆలమూరు మండలం జొన్నాడలోని జిల్లేలా పేట వద్ద గోదావరి నదిలో పడవపై సారాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో రాజోలు ఎస్ఈబీ (ఎక్సైజ్) ఎస్ఐ రఘు, కానిస్టేబుళ్లు నానాజీ, వాసంశెట్టి శ్రీనివాసులు సారాయి అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సారాయి వ్యాపారం చేస్తున్న ఆరుగురు పోలీసులపై దాడులు చేశారు, ఈ ఘటనలో కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అతడిని ఆలమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ మండపేట రూరల్ సీఐ శివగణేశ్ ఆసుపత్రికి హుటాహుటిన చేరుకుని క్షతగాత్రుడు ఎస్ఈబీ కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీనివాసుడు నుండి వాంగ్మూలం తీసుకున్నారు. దీనిపై శ్రీనివాసులు ఇచ్చిన సమాచారంతో ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమలాపురం ఎస్ఈబీ అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ శ్రీనివాస్.. ఆసుపత్రికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.