ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

అక్రమ ఆయుధాల విక్రయ ముఠా అరెస్ట్​.. 18 ఆయుధాలు స్వాధీనం - నకిలీ ఆయుధాల ముఠా అరెస్ట్​

Illegal Arms Gang Arrest: నకిలీ కరెన్సీ కేసులో నిందితులను విచారిస్తుండగా అక్రమ ఆయుధాల విక్రయాలకు సంబంధించిన సమాచారం బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బెంగళూరుకు చెందిన ముఠాను అరెస్ట్​ చేశారు. మధ్యప్రదేశ్​లో తయారీ కేంద్రం ఉందని గుర్తించారు. 18 ఆయుధాలు, 95 రౌండ్ల బుల్లెట్లు, 6 అదనపు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ రాజేంధ్రనాథ్​రెడ్డి వెల్లడించారు.

weapons
weapons

By

Published : Dec 26, 2022, 7:55 PM IST

Updated : Dec 26, 2022, 9:53 PM IST

Illegal Arms Gang Arrest: రాష్ట్రంలో అక్రమ ఆయుధాల విక్రయాల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. బళ్లారి, అనంతపురం కేంద్రంగా జరుగుతున్న ఆయుధాల దందాలో కీలక నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 18 ఆయుధాలను అనంతపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఆయుధాల అక్రమ తయారీ గుట్టు వెలుగులోకి వచ్చిందని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

బెంగుళూరుకు చెందిన రౌడీషీటర్లను విచారించగా.. మధ్యప్రదేశ్​లో తయారీ కేంద్రం ఉందని వెల్లడించారు. జంషీద్, ముబారక్, రియాజ్, అమీర్ పాషా అనే బెంగుళూరు ముఠాను అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఆయుధాలు తయారు చేస్తున్న రాజ్​పాల్ సింగ్ అనే కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీజీపి తెలిపారు. గతంలో హత్యలు, నకిలీ కరెన్సీ చలామణి, ఆయుధాల విక్రయాలు, గంజాయి స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించామన్నారు. అనంతరపురం ఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేశామన్నారు. 18 ఆయుధాలు, 95 రౌండ్ల బుల్లెట్లు, 6 అదనపు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో 9ఎంఎం ఫిస్టల్స్, తపంచా, రివాల్వర్లు ఉన్నాయన్నారు.

అక్రమ ఆయుధాల విక్రయ ముఠా అరెస్ట్​

ఇవీ చదవండి:

Last Updated : Dec 26, 2022, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details