ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

భార్య కాపురానికి రాలేకదని భర్త ఆత్యహత్య - తెలంగాణ వార్తలు

ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పెద్దామంగలరం గ్రామానికి చెందిన మల్లేష్. పలు కారణాలతో ఆరు నెలలుగా భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు ఒడిగట్టాడు.

suicide
భార్య కాపురానికి రాలేకదని భర్త ఆత్యహత్య

By

Published : May 14, 2021, 9:18 AM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ పెద్దామంగలరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రాలేదని మనస్తాపంతో చాకలి మల్లేష్ అనే వ్యక్తి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏపీలోని గుంటూరుకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. భార్యాభర్తలిద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తారని వెల్లడించారు.

పలు కారణాల వల్ల ఇద్దరూ ఆరు నెలలుగా విడిగా ఉన్నట్లు తెలిపారు. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఆ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మొయినాబాద్ పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

లైసెన్సు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details