పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను హత్య చేశాడు. అక్కినేని సుందర్ రావు అనే వ్యక్తి.. తన భార్య అప్పమ్మ(58)ను అతి కిరాతకంగా గొంతు కోయటంతో అక్కడికక్కడే మరణించింది. భార్యపై అనుమానంతోనే హత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కట్టుకున్నవాడే కడతేర్చాడు.. కారణం అదేనా..? - భార్యను చంపిన భర్త
Husband murdered his wife: భార్య మీద తనకున్న అనుమానమే పెనుభూతమైంది. అది కాస్త అర్ధాంగినే.. గొంతు కోసి అంతమొందించే స్థాయికి చేరింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని సత్యవాడలో జరిగింది.
Husband murdered his wife
గతంలోనూ నేర చరిత్ర..
సుందర్ రావుకు గతంలోనూ నేరచరిత్ర ఉంది. పాతికేళ్ల క్రితం భార్యపై అనుమానంతో కత్తితో గాయపరిచాడు. హైదరాబాద్లోను ఒక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని ఆమెను సైతం హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. పదేళ్లు జైలు శిక్ష అనుభవించి కొద్దికాలం క్రితమే స్వగ్రామంలో ఉంటున్న భార్య వద్దకు తిరిగచ్చాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:Mother Suicide Attempt: తల్లి మనసు విరిగింది.. తనకు తాను కాల్చుకుంది