MURDER: భార్యభర్తలు కలిసుండటానికి కారణాలు చెప్పలేం కానీ.. విడిపోవాలనుకుంటే మాత్రం ప్రతీది ఓ కారణమే అవుతుంది. తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం వడ్డిపాలెంలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత.. భార్యభర్తలుగా కలిసి ఉండలేక 15 ఏళ్ల క్రితం ధనమ్మ, రమణయ్య దంపతులు విడాకులు తీసుకున్నారు. అనుకోకుండా రెండు నెలల క్రితం కలసిన వారు మళ్లీ దంపతులుగా మారిపోయారు. తరువాత ఏమైందో ఏమో గాని, ఇవాళ తెల్లవారు జామున ఇనుప రాడ్‌తో భార్య తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం ఊరి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..రమణయ్య కోసం గాలింపు చేపట్టారు.
15ఏళ్ల క్రితం విడిపోయారు.. రెండు నెలలక్రితం మళ్లీ కలిశారు.. కానీ భార్యను చంపేశాడు..! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
MURDER: ఆ భార్యభర్తలిద్దరు 15ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వాళ్లది అన్నట్లు ఉంటున్నారు. ఏమైందో తెలియదు కానీ రెండు నెలల క్రితం కలిసి మళ్లీ నెల క్రితం వేరుపడ్డారు. తాజాగా ఈరోజు తెల్లవారుజామున ఇనుపరాడ్‌తో భార్య తలపై కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది.
MURDER