Husband Harasses wife in Hyderabad : కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా భార్యతో ప్రమాణం చేశాడు. కొన్నేళ్లలోనే అవన్నీ మర్చిపోయాడు. ఇటీవల కొంతకాలంగా ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరగడం ప్రారంభించాడు. ఖర్చులకు డబ్బు లేక భార్యను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అనుకున్నది జరక్కపోయే సరికి.. పడక గదిలో భార్య అశ్లీల దృశ్యాలను తన చరవాణిలో ఆమెకు తెలియకుండా రికార్డు చేసి సోషల్ మీడియా ద్వారా స్నేహితుడికి పంపించాడు.
ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు భర్తను నిలదీసింది. అదనపు కట్నం తీసుకురా.. లేదా నా స్నేహితుడితో ఏకాంతంగా గడుపు అని ఆమెను తన భర్త ఒత్తిడి చేశాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. అతని తీరు మారలేదు. వేదన భరించలేక ఆమె చివరకు శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది. భర్త, అత్తమామలతో పాటు మరో ముగ్గురిపై ఆదివారం కేసు నమోదు చేశారు.