విజయవాడ అజిత్ సింగ్ నగర్లో దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. అజిత్ సింగ్ నగర్ బుడమేరు మధ్య కట్ట ప్రాంతంలో అప్పల నరసమ్మ, దుర్గారావు దంపతులు నివాసముంటున్నారు. భర్త ఆటో డ్రైవర్గా పనిచేస్తుండగా... భార్య కూలీ పనులకు వెళ్తుంటుంది.
HUSBAND MURDERED HIS WIFE: మెడకు చున్నీ బిగించి భార్య ఊపిరి తీసిన భర్త - విడయవాడలో దారుణం
భార్యపై అనుమానం పెంచుకున్నాడో భర్త. ఆమె ఏం చేసినా తప్పుగానే చూసేవాడు. రోజురోజుకీ ఆ అనుమానం పెనుభూతంగా మారింది. తట్టుకోలేని ఆ భర్త... ఆమె మెడకు చున్నీని బిగించి ఉరివేశాడు. ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఈ విషాద ఘటన విజయవాడ అజిత్సింగ్ నగర్లో జరిగింది.
![HUSBAND MURDERED HIS WIFE: మెడకు చున్నీ బిగించి భార్య ఊపిరి తీసిన భర్త HUSBAND MURDERED HIS WIFE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13156429-thumbnail-3x2-murder.jpg)
HUSBAND MURDERED HIS WIFE
కొంతకాలంగా భార్య అప్పల నరసమ్మపై అనుమానం పెంచుకున్న దుర్గారావు... ఆమెని చంపాలని నిర్ణయించుకున్నాడు. వద్దూ వద్దని వాదిస్తున్నా... భార్య మాట వినకుండా చున్నీని మెడకు బిగించి ప్రాణాలు తీశాడు. అనంతరం నేరుగా ఏఎస్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:iyr krishna rao: 'ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీస్కుంటున్నరు..!'