ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

భార్యతో గొడవ.. పీఎస్‌‌ ఎదుట భర్త ఆత్మహత్యాయత్నం

తెలంగాణలోని వరంగల్‌లో.. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. అది కూడా.. పోలీస్ స్టేషన్ ఎదుట. అప్రమత్తమైన పోలీసులు.. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

sucide attempt at police station
భార్యతో గొడవ.. పీఎస్‌‌ ఎదుట భర్త ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 1, 2021, 2:24 PM IST

తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అబ్బనికుంట గ్రామానికి చెందిన హరికృష్ణకు కొన్ని రోజులుగా తన భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులు స్పందించకపోయే సరికి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు బాధితుడిని హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ఘటనాస్థలిని వరంగల్ తూర్పు ఏసీపీ గిరి కుమార్ పరిశీలించారు. హరికృష్ణ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ ఆవరణలో మరో బాధితుడు తన భార్య కాపురానికి వచ్చేలా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు.

ABOUT THE AUTHOR

...view details