తెలంగాణలోని హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. లో దుస్తుల్లో అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు వేర్వేరు విమానాల్లో హైదరాబాద్ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి 600 గ్రాములకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Gold Seized: లో దుస్తుల్లో బంగారం అక్రమ రవాణా.. ముగ్గురి అరెస్టు - బంగారం సీజ్
తెలంగాణలోని హైదరాబాద్లో భారీస్థాయిలో బంగారం పట్టుబడింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికుల వద్ద నుంచి 600 గ్రాములకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
లో దుస్తుల్లో బంగారం అక్రమ రవాణా.. ముగ్గురి అరెస్టు
కువైట్ నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు వేముల శ్రీనివాస్, అమర్‌గొండ శ్రీనివాస్‌ల నుంచి రూ.12.31 లక్షలు విలువైన 256 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద 350 గ్రాముల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి:polavaram:పోలవరం నిధులపై మళ్లీ కొర్రీ