ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

వీడియో కాల్​ ద్వారా ప్రసవం!! చివరికి ఏం జరిగింది?

Hospital negligence Child died: వైద్యులు వీడియో కాల్​ ద్వారా ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి సూచనలు ఇస్తూ ప్రసవం చేయడం సినిమాల్లోనే చూశాము.. కానీ ఇక్కడ నిజ జీవితంలో కూడా అటువంటి సన్నివేశాలు చూస్తామని అనుకోలేదు.. ఎందుకంటే డాక్టర్లు లేకుండా ఎటువంటి ఆపరేషన్​లు జరగవు. వారి సూచన మేరకు వైద్య సిబ్బంది మిగిలిన పని పూర్తి చేస్తారు. అటువంటిది వైద్యుడు లేకుండా అంటే ఆపరేషన్​ సక్సెస్​ కానీ ఫెయిల్​ కానీ అవుతుంది. ఇక్కడ మాత్రం ఆపరేషన్​ ఫెయిల్​నే అయింది. ఎక్కడ అనుకుంటున్నారా? ఎలా జరిగిందో తెలుసా?

Hospital negligence Child died
Hospital negligence Child died

By

Published : Sep 29, 2022, 7:35 PM IST

Hospital negligence Child died: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఆరు నెలల గర్భిణి స్త్రీ ఆసుపత్రికి వస్తే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసికందు మృతి చెందిన ఘటన మాదాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కొండాపూర్​ ప్రాంతంలో జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు.

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సురేష్, మౌనిక దంపతులు కొండాపూర్​లో నివాసం ఉంటున్నారు. మౌనిక గర్భిణి కావడంతో ఈనెల 26న రాత్రి కడుపు నొప్పి రావడంతో దగ్గరలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. అయితే రాత్రి నొప్పులు రావడంతో డాక్టర్లు అందుబాటులో లేరని సిబ్బంది చికిత్స చేశారు. వీడియో కాల్ ద్వారా డాక్టర్​ అక్కడ ఉన్న వైద్య సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో వారు చికిత్స చేశారు.

నెలలు నిండకుండానే గర్బిణీ ప్రసవించడంతో శిశువు మరణించింది. దీంతో ఆ పసికందును అక్కడి నుంచి తీసుకొచ్చి ఖననం చేశారు. వీడియో కాల్​లో చికిత్స చేయడం వల్లే శిశువు చనిపోయిందని.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగా భావించి బాధితురాలి భర్త మాదాపూర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో రెండు రోజుల క్రితం పూడ్చి పెట్టిన చిన్నారిని శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మౌనికకు గ్యాస్​ ట్రబుల్​ రావడంతో అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. ఆ సమయంలోనే నొప్పులు రావడంతో వైద్యులు అందుబాటులో లేక వీడియో కాల్​ ద్వారా నర్సుకు సూచనలు చేశామని చెప్పారు. ఇక్కడ డెలివరీ సౌకర్యం లేకపోవడంతో మరో ఆసుపత్రి తరలించాలనుకున్నామన్నారు. కానీ ఇంతలోనే చిన్నారి మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details