తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. పెట్రోల్ పంపు ఎదుట దుండగులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. న్యాయవాది వామన్‌రావు, భార్య నాగమణిపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నుంచి మంథని వెళ్తుండగా దుండగులు వాహనాన్ని అడ్డుకున్నారు. కారులోనే కత్తులతో విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన న్యాయవాది వామన్‌రావు రోడ్డుపై రక్తపు మడుగులో పడిపోయాడు. పక్కనే వాహనదారులు వెళ్తున్నా స్పందించలేదు. అతని భార్య నాగమణి కారులోనే విలవిల్లాడారు. రక్తపుగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
తెలంగాణ: హైకోర్టు న్యాయవాది దంపతులను నరికి చంపిన దుండగులు - పెద్దపల్లిలో న్యాయవాది దంపతుల హత్య
తెలంగాణలో దారుణం జరిగింది. హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో ఈ ఘటన జరిగింది.
తెలంగాణ: హైకోర్టు న్యాయవాది దంపతులను నరికిచంపిన దుండగులు
దుండగుల దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారు సీట్లో ఉన్న పత్రాలు రక్తంతో తడిసిపోయాయి. బాధితులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ దంపతులు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లాలో పట్టపగలు జరిగిన ఈ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. దుండగుల కోసం పోలీసుల విస్తృతంగా గాలింపు చేపట్టారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు జరుపుతున్నారు.
ఇదీ చదవండీ... ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులకు సీఎం హామీ
Last Updated : Feb 17, 2021, 4:55 PM IST