- కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో తండ్రి(58) అసిస్టెంట్ మేనేజర్.. కుమారుడు అమెరికాలోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. కుమారుడికి పెళ్లి చేయాలని మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో వివరాలు పెట్టాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఓ కి‘లేడీ’ రూ.1.72 లక్షలు టోపి పెట్టింది. తెలంగాణలోని సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. ఈయనొక్కరే కాదు.. ఇలాంటి బాధితుల సంఖ్య చాలానే ఉంది.
- నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం రంగనాయకులపేటకు చెందిన స్వాతి(30) ఎంబీఏ పూర్తి చేసింది. నగర శివారులోని ఘట్‌కేసర్ పోచారంలో నివాసముంటుంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలకు పాల్పడుతుంది. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలై మళ్లీ అదే దారిలో వెళ్తుంది. తాజాగా రాచకొండ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఆమె ఒక్కరే కాదు.. ఇలాంటి కి‘లేడీ’లు ఇంకా చాలా ముందే ఉన్నారని అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అక్కడే ఉన్నట్లు వర్చువల్ నంబర్...
గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న గుర్తు తెలియని మహిళల ఫొటోలతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టిస్తున్నారు. స్థానికులైతే ఇబ్బందులు ఎదురవుతాయని ఎన్‌ఆర్‌ఐలపై గురి పెడుతున్నారు. విదేశాల్లో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని, పెళ్లి తర్వాత కూడా అక్కడే ఉంటానని, ఎన్‌ఆర్‌ఐలు మాత్రమే సంప్రందించాలని ప్రొఫైల్‌లో పేర్కొంటున్నారు. సెకండ్ లైన్ యాప్ తదితర మొబైల్ యాప్‌ల సాయంతో వర్చువల్ నంబర్(విదేశాల్లో ఉన్నట్లుగా ఫోన్ నంబర్)ను సృష్టిస్తున్నారు. ఆ నంబర్‌ను అన్ని మ్యాట్రీమోనీ వెబ్‌సైట్లలోనూ పోస్ట్ చేస్తున్నారు. బాధితులకు అనుమానం రాకుండా ఈ నంబర్(యాప్) ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారు. ఫోన్ నంబర్ అక్కడిదే కావడంతో బాధితులకు ఎలాంటి అనుమానం రావడం లేదు.
ఇక్కడి నుంచే అసలు కథ...