ROBBERY: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఫిన్‌కేర్ ఫైనాన్స్ సంస్థలో భారీ దోపిడీ జరిగింది. రూ.85లక్షలు విలువైన బంగారం, నగదును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. గురువారం రాత్రి సంస్థ సిబ్బంది విధులు ముగించికొని ఇంటికి వెళ్లారు. ఆఫీసులో పని ఉండడంతో స్రవంతి అనే క్లర్క్ రాత్రి పదిన్నర గంటల వరకు అక్కడే ఉన్నారు. పనిలో నిమగ్నమై ఉండగా ముగ్గురు దుండగులు లోనికి ప్రవేశించారు. స్రవంతిని బెదిరించి కాళ్లు, చేతులు కట్టేసి అక్కడ ఉన్న రూ.85లక్షల విలువైన బంగారం, నగదు దోచుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక డీఎస్పీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పట్టణ, పరిసర ప్రాంతాల్లోని చెక్‌పోస్ట్‌లు తనిఖీ చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు.
ROBBERY: ఫిన్‌కేర్ ఫైనాన్స్ సంస్థలో భారీ దోపిడీ.. - తిరుపతి జిల్లా తాజా వార్తలు
ROBBERY: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఫిన్‌కేర్ ఫైనాన్స్ సంస్థలో భారీ దోపిడీ జరిగింది. రూ.85లక్షలు విలువైన బంగారం, నగదును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు.
![ROBBERY: ఫిన్‌కేర్ ఫైనాన్స్ సంస్థలో భారీ దోపిడీ.. ROBBERY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15397042-289-15397042-1653618707103.jpg)
ఫిన్‌కేర్ ఫైనాన్స్ సంస్థలో భారీ దోపిడీ