ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

GUN MISSFIRE: తుపాకీ మిస్‌ఫైర్‌.. హెడ్‌కానిస్టేబుల్‌ మృతి - constable died as Gun Miss Fires in bhadradri

తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు విడిచాడు. ఆయుధాలు పరిశీలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. త్వరగా ఓ ఇంటివాడవుతాడనగా.. అతను వృతి చెందడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

GUN MISSFIRE
GUN MISSFIRE

By

Published : Feb 12, 2022, 9:42 AM IST

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాచనపల్లి పోలీస్‌స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. తుపాకీ మిస్‌ఫైర్‌ అయి హెడ్‌కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయుధాలు పరిశీలిస్తుండగా ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

మృతుడు సంతోశ్‌ వరంగల్‌ జిల్లా గవిచర్ల వాసి అని వెల్లడించారు. ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. 3 రోజుల క్రితమే సంతోశ్‌కు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం చూశారు. త్వరలో ఓ ఇంటివాడవుతాడనగా.. మృతి చెందడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

  • ఇదీ చదవండి :

Lockup death: నెల్లిమర్ల పీఎస్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి.. అసలేమైంది?

ABOUT THE AUTHOR

...view details