Variety thief arrested: దొంగతనాలు చేయడానికి.. పథకం పన్ని దాన్ని పక్కాగా అమలుపరుస్తుంటారు దుండగులు. కానీ, ఓ దొంగ మాత్రం రాత్రిళ్లు కలలు కని.. ఉదయాన్నే దొంగతనానికి పాల్పడతాడు. ఇదేదో సినిమా కథలా ఉందనుకుంటే మనం పొరపడినట్లే. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ రీతిలో దొంగతనాలకు పాల్పడుతూ.. చివరకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీసులకు చిక్కాడు.
హైదరాబాద్ సీపీ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల గాంధీనగర్ కు చెందిన ముచ్చు అంబేడ్కర్(50), అలియాస్ రాజు, అలియాస్ కందుల రాజేంద్రప్రసాద్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. 1989 నుంచి హైదరాబాద్‌తో పాటు కర్ణాటకలోనూ దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. 1991లో లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో 21 కేసులు నమోదయ్యాయి. పోలీసులు అరెస్టు చేసినా, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. గత పదేళ్లుగా నగర శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు.