ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

అప్పు తీర్చినా ఆగని వేధింపులు.. సీఎం జగన్​కు స్థిరాస్తి​ వ్యాపారి సూసైడ్​ నోట్​ - Lender threats

Realtor suicide: అతనో రియల్​ ఎస్టేట్​ వ్యాపారి... అవసరానికి ఓ వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు.. ఆ తర్వాత తిరిగి మొత్తం చెల్లించాడు.. కానీ ఇంకా కట్టాలని.. లేకపోతే ఊరుకునేది లేదని అప్పు ఇచ్చిన వ్యక్తి బెదిరించాడు... ఏం చేయాలో అర్ధంకాక.. ఉన్న ఊరిలో ఉండలేక హైదరాబాద్​లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సీఎం జగన్​కు అడ్రస్​ చేస్తూ సూసైడ్​ నోట్​ రాశాడు.

suicide
suicide

By

Published : Aug 3, 2022, 10:37 PM IST

Suicide note to AP Name: గుంటూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి ముఖ్యమంత్రి జగన్‌కు సూసైడ్‌ నోట్ రాసి.. హైదరాబాద్​లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరులోని కొరిటపాడుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి గిరిధర్‌ వర్మ.. వెంకటరెడ్డి వద్ద రూ.5లక్షలు అప్పు తీసుకున్నాడు. మొత్తం తిరిగి చెల్లించినా.. ఇంకా కట్టాలని.. డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వెంకటరెడ్డి బెదిరించాడని లేఖలో పేర్కొన్నాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆర్థిక సమస్యలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నానని సీఎం జగన్‌ను అడ్రస్‌ చేస్తూ.. సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Lender threats: కొరిటపాడుకు చెందిన గిరిధర్‌ 3 నెలల క్రితం హైదరాబాద్‌ కుషాయిగూడలోని ఆదిత్యనగర్‌కు వచ్చి అద్దె గదిలో ఉంటున్నాడు. రాత్రి బంధువుల ఇంట్లో భోజనం చేసి.. తెల్లారే సరికి విగతజీవుడై కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details