YOUNG MAN CHEATS A YOUNG WOMAN : ప్రస్తుత కాలంలో ఎవరికైనా పెళ్లిళ్లు చేయాలి అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది మ్యాట్రిమొనీ సంస్థలు. ఎక్కడెక్కడో వెతకడం ఎందుకనుకునే వాళ్లందరూ వీటినే ఎంచుకుంటారు. అందులో మనకు నచ్చిన, మనం మెచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుని వారిని జీవిత భాగస్వామ్యులుగా ఎంచుకోవచ్చు. అయితే తాజాగా కొందరు మోసగాళ్లు వాటిని అలుసుగా చేసుకుని వారి అవసరాలను అలవోకగా తీర్చుకుంటున్నారు.
మ్యాట్రిమొనీలో అందమైన ఫొటోలు పెట్టి, తనకు రూ. 100 కోట్ల ఆస్తి ఉందని యువతులను నమ్మించి పెళ్లి పేరుతో మోసగిస్తున్న ఓ కేటుగాడిని గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. రూ.లక్షలు దోచేసి విమానం ఎక్కి దేశాన్ని దాటే క్రమంలో జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చొరవతో పోలీసు బృందాలు అరెస్టు చేశాయి. సేకరించిన సమాచారం ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ యువతి లండన్‌లో సాఫ్ట్‌వేర్ కొలువు చేస్తోంది. ఆమెకు వివాహం చేయాలని తల్లి ప్రయత్నాలు చేస్తోంది. విషయం తెలిసిన హైదరాబాద్‌కు చెందిన ఈ యువకుడు తాను పెళ్లి చేసుకుంటానని ఆస్తి, జీతంపై మాయమాటలు చెప్పాడు.