అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరాంపేటలో దారుణం జరిగింది. శివరాంపేటకు చెందిన గ్రామ వాలంటీర్ శ్రీకాంత్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గత అర్థరాత్రి వేరుశనగ పంటకు కాపలా వెళ్లిన శ్రీకాంత్.. తెల్లవారేసరికి పొలం దగ్గరే శవమై కనిపించాడు. పొలంలో నిద్రిస్తుండగా దుండగులు గునపంతో పొడిచి చంపారు. ఉదయం పొలం వైపుగా వెళ్తున్న కొందరు గుర్తించి.. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాంత్ తండ్రిని చంపబోయి.. అతని కొడుకుపై దాడి జరిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
గ్రామ వాలంటీర్‌ను హత్య చేసిన దుండగులు - grama volunteer murder at kuderu
అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరాంపేటలో దారుణం జరిగింది. పొలంలో నిద్రిస్తున్న గ్రామ వాలంటీర్‌ను దుండగులు గునపంతో పొడిచి హత్యచేశారు.
గ్రామ వాలంటీర్‌ను హత్య చేసిన దుండగులు
ఇదీ చదవండి:
రేపే పురపోరు ఓట్ల లెక్కింపు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ
Last Updated : Mar 13, 2021, 12:14 PM IST