ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

విజయవాడ దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్‌ బాబుపై బదిలీ వేటు - దుర్గ గుడిలో అనిశా సోదాలు

vijayawada durga temple eo suresh babu corruption
విజయవాడ దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్‌ బాబుపై బదిలీ వేటు

By

Published : Apr 7, 2021, 6:00 PM IST

Updated : Apr 7, 2021, 7:19 PM IST

17:57 April 07

విజయవాడ దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్‌ బాబు బదిలీ

విజయవాడ దుర్గగుడిలో అవినీతి వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవో సురేశ్​బాబుపై వేటు వేసింది. ఆయన స్థానంలో రాజమహేంద్రవరం జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబను దుర్గగుడి ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సురేశ్‌బాబు దేవాదాయ శాఖ ఆర్‌జేసీగా బదిలీ అయ్యారు.

ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు దుర్గగుడిలో విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించాయి. ఈవో సురేశ్‌బాబు ఆర్థిక తప్పిదాలకు పాల్పడ్డారని అ ని శా నివేదిక ఇచ్చింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. దుర్గ గుడి ఈవో సురేశ్‌బాబును బదిలీ చేసింది. ఇప్పటికే అవినీతి ఆరోపణలున్న పలువురు సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు  తీసుకుంది.

ఇదీ చదవండి:

లాలూకి రాని బెయిల్.. జగన్​కు ఎలా వచ్చింది..?: చింతా మోహన్

Last Updated : Apr 7, 2021, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details