ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kidnap: పోలీసులమని చెప్పారు.. బాలికను కిడ్నాప్ చేశారు..!

By

Published : Jul 31, 2021, 12:51 PM IST

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ ఎస్టీ కాలనీలో శుక్రవారం రాత్రి కిడ్నాప్​కు గురైన బాలిక (14) ఆచూకీ ఇంకా లభించలేదు. పోలీసులమంటూ వచ్చిన ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు.. బలవంతంగా బాలికను తీసుకువెళ్లడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

కిడ్నాప్
కిడ్నాప్

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ ఎస్టీ కాలనీలో శుక్రవారం రాత్రి కిడ్నాప్​కు గురైన 14 ఏళ్ల బాలిక జాడ ఇంకా తెలియరాలేదు. పోలీసులమంటూ బాలిక ఇంటికి వచ్చిన ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు బలవంతంగా తీసుకువెళ్లడం కలకలం రేకెత్తించింది. మద్యం విక్రయాలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై విచారణకు రావాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు బాలిక కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేశారు.

తాము మద్యం అమ్మడంలేదని బాలిక చెప్పినా వారు వినిపించుకోలేదు. మాట్లాడాలని.. విచారణకు రావాలని పిలిచిన దుండగులు, ఆటోలో బలవంతంగా తీసుకువెళ్లారు. విషయం తెలుసుకునేందుకు పోలీసు స్టేషన్​కు వెళ్లిన కుటుంబసభ్యులు, అక్కడ బాలిక లేకపోవడంతో నివ్వెరపోయారు. జరిగిన విషయాన్ని వివరించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత కథనం:

ABOUT THE AUTHOR

...view details