ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

యాదాద్రిలో విషాదం.. పుణ్యస్నానాలు చేస్తుండగా.. - ts news

Yadadri: తెలంగాణలోని యాదాద్రి కొండ కింద విషాదం నెలకొంది. లక్ష్మీ పుష్కరిణిలో పడి బాలిక మృతిచెందింది.

By

Published : May 16, 2022, 9:43 AM IST

Yadadri: తెలంగాణలోని యాదాద్రి కొండ కింద గండి చెరువు ప్రాంగణంలో గల లక్ష్మీ పుష్కరిణిలో పడి ఓ బాలిక మృతి చెందింది. కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరిణిలో స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు హైదరాబాద్ గుడి మల్కాపూర్​కి చెందిన బొంతల రోజా(15)గా గుర్తించారు. బాలిక మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దైవదర్శనానికి వచ్చిన తమకు ఇలా జరిగిందంటూ బాలిక తల్లి రోదించిన తీరు పలువురిని కలచివేసింది.

బాలిక మృతితో లక్ష్మీ పుష్కరిణిలో స్నానం ఆచరించడానికి ఆలయ అధికారులు అనుమతి నిలిపివేశారు. సంప్రోక్షణ తదుపరి అనుమతిస్తామని వెల్లడించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details