ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తెలంగాణ: లారీ ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతి

సంతోషంగా ఇంటిముందు ఆడుకుంటున్న ఓ పాపను లారీ మృత్యు రూపంలో కబళించింది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ పాప మీదినుంచి దూసుకెళ్లింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప కళ్లముందే కానరానిలోకాలకు వెళ్లటంతో తల్లిదండ్రులు దుఃఖం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈ ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రంలోని మొరంచపల్లి గ్రామం వద్ద జరిగింది.

girl-died-in-road-accident-at-moranchapallty-jayashankar-bhupalpally-district
తెలంగాణ: లారీ ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతి

By

Published : Feb 11, 2021, 10:59 PM IST

అతివేగంగా దూసుకొచ్చిన లారీ ఓ పాప నిండు ప్రాణాలు బలితీసుకుంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రంలోని మొరంచపల్లి గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల మిల్కీ అనే పాపను టిప్పర్ లారీ ఢీ కొట్టటంతో.. అక్కడికక్కడే మృతి చెందింది.

తెలంగాణ: లారీ ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతి

ఆగ్రహించిన స్థానికులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్​ను చితకబాది.. టైర్లలో గాలి తీసేశారు. పాప బంధువులు, గ్రామస్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కలెక్టర్ వచ్చేవరకు ధర్నా విరమించేది స్పష్టం చేశారు. జాతీయ రహదారి కావటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. కిలోమీటర్​ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details